నాదేశం
20, నవంబర్ 2013, బుధవారం
15, నవంబర్ 2013, శుక్రవారం
మహా తెలంగాణా అంటే ఏమిటీ తెలంగాణా వాదులూ....
అసలు తెలంగాణా అంటే ఏమిటొ తెలంగాణా వాదులకు తెలుసా???
15వ శతాబ్దం లో నేటి భాషా ప్రయుక్త రాష్ట్రాలు కాకుండా అప్పటి రాజ్యాలను చూపే భారతదేశ పటాన్ని ఇక్కడ చూపుతున్నాను గమనించండి. అసలు తెలంగాణా అని దేనిని అనేవారో....
తెలుగు ప్రజలారా ఇప్పటికైన కళ్ళు తెరవండి
ఇప్పటి తెలంగాణా వాదుల తెలంగాణా ఒక భ్రమ దానిని అమాయక ప్రజలకు చూపించి అదే నిజమని నమ్మించి తెలుగు జాతి గొంతు కోస్తున్నారు...
స్వార్థ రాజకీయాల కొరకు తెలంగాణా వాదాన్ని సృష్టించారు. అసలు తెలంగాణా అంటే ఇప్పటి కోస్తా ప్రాంతమే అనే విషయం ఈ క్రింది మేప్ చూడండి వాస్తవం తెలుస్తుంది.
తెలంగాణా వాదం లో బోలుదనం బయట పడుతుంది.
23, ఆగస్టు 2013, శుక్రవారం
అయ్యా కెసిఆర్ గారూ, కెటిఆర్ గారూ ఇప్పటివరకు మీరు సంపాదించుకున్న సంపద చాలదా? చూడండి రాష్ట్రాన్ని చీల్చవద్దని ఎంతమంది కోరుకుంటున్నారో... వీరంతా మీ లాగా రాజకీయ నాయకులు కాదు. సామాన్య ప్రజలు. ఈది ప్రజాస్వామ్యమే అయితే ఈక్కడ ప్రజలే ప్రభువులు అయితే వారే శాసిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ను చీల్చవద్దని. వీరిలో ఏ ఒక్కరైనా మీ తెలంగాణా సంపదను దోచుకున్నారా??? గుండెమీద చేయి వేసుకుని చెప్పండి. ఈ ఉద్యమం ఇంతటితో ఆగుతుందంటే మీరు పప్పులో కాలు వేసినట్లే.
ఈ టైలర్లు కర్నూలు జిల్లాలో మారు మూల మండలమైన వెలుగోడుకు చెందిన వారు 23-8-2013 న రాష్ట్రాన్ని విభజించవద్దని నిరాహార దీక్షలు చేస్తున్నారు, మారుమూల గ్రామాలకు సైతం ఈ ఊద్యమం చేరింది. చేతనైతే అడ్డుకోండి సోనియా వచ్చి అడ్డుకుంటుందో, కెసిఆర్ అడ్డుకుంటాడో చూద్దాము.
22, ఆగస్టు 2013, గురువారం
పాలమూరు కూలీలకు అన్నం పెట్టాము మేము దొంగలమా???
ఈ లక్ష మందికి డబ్బులివ్వలేదు, చీప్ లిక్కర్లు ఇవ్వలేదు, ఏ లారీలు పెట్టి తోలలేదు. పనులు మానేశారు,చదువులకు స్వస్తి పలికారు, ఎంసెట్ కౌన్సిలింగ్ అక్కర్లేదన్నారు. మరి వీరందరిని ఈక్కడికి నడిపిన బంధమేమిటి? మద్రాసు ను పోగొట్టుకున్నాం, కుర్నూలును పొగొట్టుకున్నాం,హైదరబాదును కూడా పోగొట్టుకుంటున్నాం అన్న భయమేమో... తెలుగువాడి ప్రతిభను ప్రపంచానికి చాటాలన్న దూరదృష్టి లేకుండా తమచుట్టూ గిరిగీసుకుని పబ్బం గడుపుకునే పనికిమాలిన రాజకీయాలకు బలైపోతున్నమనే భయమా... అవును ఖచ్చితంగా ఇదే. ఒక్క కర్నూలు లోనే ఇంతమంది నిరసనలు తెలిపితే రాష్ట్రం మొత్తం నెక్లెస్ రోడ్డుకు చేరితే అది సరిపోతుందంటారా... 22వ తేదీన కర్నూలు లో జరిగిన లక్ష గళ ఘోష దృశ్యాలివి. ఇక్కడ చేరింది నగరం లోని జనాలు మాత్రమే. మారు మూల పల్లెల్లో కూడా సమైఖ్య ఉద్యమం రగులుతోంది. కన్నీళ్ళతో సేద్యం చేసి కుర్నూలుసోనా సన్న బియ్యం ప్రపంచానికి అందించాము. ఆ బియ్యం పండించడానికి నీళ్ళు దొరకవని భయం. త్రాగడానికి నీరు దొరకని వీరు ప్రపంచానికి సన్న బియ్యాన్ని అందించారు. వీరికి తెలంగాణాను దోచుకోవాల్సిన అవసరం వుందంటారా...పాలమూరు వలస కూలీలకు అన్నం పెట్టిన వీళ్ళు వాళ్ళను దోచుకుంటారా? కుహనా తెలంగాణ వాదులారా ఒక్కసారి స్వార్థం వీడి వాస్తవాలు చూడండి. కృష్ణా జలాలు మొత్తం మీవేనా వాటి పై మాకేమీ హక్కు లేదా? బ్రాహ్మడి చేతిలోని మేకను లాక్కోవడానికి కుక్క కుక్క అన్న దొంగల సంగతి మరచిపోకండి. కుహనా తెలంగాణ వాదుల మాటలకు మోసపోకండి.
21, ఆగస్టు 2013, బుధవారం
ఏది అసలైన ఉద్యమం - ఏది నకిలీ ఉద్యమం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)





























